![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి (Godhavari ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-35 లో.. జాను వాళ్ళ ఇంటికి బ్యాంక్ అధికారులు, పోలీసులు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని చెప్తారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. మాకు ఒక గంట టైమ్ ఇవ్వండి సర్.. సింహాద్రి అంకుల్ తో మాట్లాడి తీసుకొస్తామని నందు, జాను వెళ్తారు. సింహాద్రి ఇంటికి వాళ్ళు వెళ్తే అక్కడ అతను ఉండడు. ఇక అతని భార్యని మా ఇంటి పత్రాలు మీ దగ్గర ఉన్నాయా.. అంకుల్ ఇంట్లో లేరా అని నందు, జాను అడుగగా ఇంట్లో లేడని తను చెప్తుంది. నాకు ఏ పత్రాలు తెలియవని ఆమె చెప్పగానే అంకుల్ వస్తే మా ప్రాబ్లమ్ చెప్పండి అని చెప్పేసి జానూ, నందు వెళ్తారు.
మరోవైపు జానూ, నందు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తిరిగి వారి ఇంటికి వెళ్ళడం అంతా చూస్తుంటాడు సింహాద్రి. ఇక బయటకొచ్చేసిన నందు, జాను మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దామని నందు అడుగగా ఒకసారి ఫోన్ ఇవ్వు అని తీసుకొని సూర్యకి కాల్ చేస్తుంది జానూ అదేసమయంలో సూర్య వాళ్ళ అమ్మతో కారులో వెళ్తుంటాడు. ఆ అమ్మాయితో తిరుగకు.. ఫోన్ మాట్లాడకు అని వాళ్ళ అమ్మ చెప్తుంటుంది. అప్పుడే జానూ కాల్ చేయడంతో సూర్య చూస్తాడు. సూర్య వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని కాల్ కట్ చేస్తుంది. జానూ మళ్ళీ ట్రై చేస్తుంది. సూర్య వాళ్ళ అమ్మ మళ్ళీ కట్ చేస్తుంది. ఇక చేసేదేమీ లేక వాళ్ళ ఇంటికి వస్తారు.
ఇక ఇంటికి వచ్చాక పోలీసులు ఇంకా బ్యాంక్ అధికారులతో నందు, జానూ మాట్లాడతారు. మా నాన్న లోన్ తీసుకున్నట్లుగా మాకు తెలియదు.. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని వాళ్ళు అంటారు. మాకు అవన్నీ తెలియదు.. మేము నోటీసులు పంపించాం.. గడువు అయిపోయింది.. మీరు ఖాళీ చేయాలని అధికారులు, పోలీసులు చెప్తారు. జానూ ఎంత మాట్లాడినా వాళ్ళు వినకపోయేసరికి జానూ వాళ్ళ అమ్మ పోలీస్ కాళ్ళ మీద పడబోతుంటే తనని జానూ ఆపుతుంది. ఈ ఇల్లు మా నాన్న కష్టార్జితం.. ఎలాగైనా దీన్ని కాపాడుకుంటామని జాను అనగానే మీరు ఖాళీ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని పోలీసులు అంటారు. ఇక ఎంత రిక్వెస్ట్ చేసినా అధికారులు, పోలీసులు వినకపోయేసరికి జాను, నందు, వాళ్ళ అమ్మ, నానమ్మ అందరు రోడ్డు మీదకి వచ్చేస్తారు. వాళ్ళ ఇల్లుని అధికారులు సీజ్ చేస్తారు. అదంతా సింహాద్రి దూరం నుండి చూస్తుంటాడు. జానూ వాళ్ళ ఇంటికి మురళి వస్తాడు. ఇంటిని సీజ్ చేయడం చూసి షాక్ అవుతాడు. వెంటనే వారిని వెతకడానికి బైక్ పై తిరుగుతుంటాడు. అదే సమయంలో సూర్య వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |